Diet and Healthy Recipes – Video : HEALTY FOOD – ఏవి తినాలో..ఏవి తిన‌కూడ‌దో తెలుసుకుందాం..

435

HEALTY FOOD – ఏవి తినాలో..ఏవి తిన‌కూడ‌దో తెలుసుకుందాం..


Video

Description

ఏవి తినాలో..ఏవి తిన‌కూడ‌దో తెలుసుకుందాం..
కొన్ని రకాల ఆహార పదార్థాలను చూస్తే నోరుకట్టేసుకోలేం. అలాని వాటిని తరచూ తీసుకుంటుంటే మనం కోరుకునే నాజూకుదనం సొంతం కాదు. మరెలా అంటారా.. ముందు వాటివల్ల ఎదురయ్యే నష్టాలు తెలుసుకుందాం..
ఇవి తిన‌వద్దు..
మిఠాయిలు నోరూరిస్తాయి. పేస్ట్రీలూ, కుకీలూ, కేక్‌లూ చిన్నా పెద్దా ఎవరికయినా నచ్చేస్తాయి. మీరూ వాటిని పరిమితం లేకుండా లాగించేస్తుంటే మాత్రం మానేయడం మేలు. వీటిల్లో ఉపయోగించే చక్కెర్లూ, శుద్ధిచేసిన పిండీ, నూనె వంటివన్నీ శరీరానికి హానిచేసి, జీవక్రియల వేగాన్ని దెబ్బతీస్తాయి. భవిష్యత్తులో మధుమేహంతోపాటూ గుండెసంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. మ‌రి ఇవి తిన‌డం అవ‌స‌ర‌మా..
వాటికి బదులు ఇవి..
పై పదార్థాలకు బదులు ఎండు ఫలాలూ, చాక్లెట్‌, తేనె, ఖర్జూరాలూ, కూరగాయలు ఎక్కువగా వేసి చేసే కబాబ్‌లను ఎంచుకోవచ్చు.
చిప్స్ వద్దు..
కరకరలాడే బంగాళాదుంప చిప్స్‌, ఫ్రెంచ్‌ఫ్రైస్‌ ఉంటే చాలు…వాటితోనే కడుపునింపేసుకుంటారు కొందరు. కానీ నూనెలో వేయించి తీసిన ఈ పదార్థాల్లో కెలొరీలు ఎక్కువ. అధికబరువుకు కారణమవుతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం వీటిని తరచూ తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదముందట.
ఉడికించిన‌వి మేలు..
బంగాళాదుంపను మానేయాల్సిన అవసరంలేదు. ఉడికించిన బంగాళాదుంపను హాయిగా తీసుకోవచ్చు.
డ్రింక్స్ వద్దు..
దాహంగా అనిపించినప్పుడు కొందరు మంచినీళ్లకు బదులు శీతలపానీయాల్నే గడగడా తాగేస్తుంటారు. అది హాయిగా అనిపించినా ఇవీ భవిష్యత్తులో మధుమేహానికి దారితీస్తాయి. అలాగే అప్పుడప్పుడూ చక్కెర కలిపిన పండ్లరసాలను తాగేస్తుంటాం. దానివల్ల పీచు అందకపోగా..జీవక్రియల పనితీరు దెబ్బ తింటుంది.
తాజా పండ్లు బెస్ట్‌..
శీతలపానీయాలకు బదులు కొబ్బరినీళ్లూ లేదా మజ్జిగను ఎంచుకోవచ్చు. అలాగే పండ్లరసాలకు బదులు తాజాపండ్లనే ఎంచుకోవాలి. పీచూ అందుతుంది. ఆరోగ్యానికీ మంచిది.
కాఫీ, టీలు వ‌ద్దు..
కాఫీ, టీలు కడుపులో పడితే కానీ కొందరు ఏ పనీ చేయలేరు. అయితే వీటిని మితిమీరి తీసుకుంటుంటేమాత్రం తగ్గించడం మంచిది. వాటిల్లో ఉండే కెఫీన్‌తోనూ బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.
గ్రీన్ టీ బెస్ట్‌
ఒక కప్పు కాఫీ తాగినా.. మిగిలిన సమయాల్లో గ్రీన్‌ లేదా బ్లాక్‌టీని ఎంచుకోవచ్చు. బరువు కూడా తగ్గుతారు.